శుక్రవారం 03 జూలై 2020
National - Jun 03, 2020 , 20:32:40

మ‌హారాష్ట్ర‌లో 75 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో 75 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

ముంబై: మ‌హారాష్ట్రలో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ప్ర‌తి రోజులు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా 2,560 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,860కి చేరింది. 75 వేల‌కు చేరువ‌య్యింది. ఇక బుధ‌వారం చోటుచేసుకున్న 122 క‌రోనా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2587కు చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా, రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 32,329 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు.       


logo