ఆదివారం 07 జూన్ 2020
National - Apr 01, 2020 , 10:01:28

ఢిల్లీలో 120కి చేరిన క‌రోనా కేసులు

ఢిల్లీలో 120కి చేరిన క‌రోనా కేసులు

ఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. మంగ‌ళవారం ఒక్క‌రోజే అక్క‌డ కొత్త‌గా 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120కి చేరింది. కాగా ఈ 120 మందిలో ఐదుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్చి అయ్యార‌ని, ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని, మ‌రో వ్య‌క్తి విదేశాల‌కు వెళ్లిపోయాడ‌ని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మిగ‌తా వారంతా ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ హాస్పిట‌ల్‌, జీటీబీ హాస్పిట‌ల్‌, ఆర్ఎంఎల్ హాస్పిట‌ల్‌, స‌ఫ్ద‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌ల‌లో చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 


logo