బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 20:02:20

క‌ర్ణాట‌క‌లో మ‌రింత విస్త‌రిస్తున్న క‌రోనా!

క‌ర్ణాట‌క‌లో మ‌రింత విస్త‌రిస్తున్న క‌రోనా!

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వెయ్యికి పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి గురువారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1502 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేల మార్కును దాటి 18,016కు చేరింది. మొత్తం కేసుల‌లో 8,334 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 9,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా క‌ర్ణాట‌క‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 19 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌ర్ణాట‌క‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 272కు చేరింది. క‌ర్ణాట‌క వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 9,406 యాక్టివ్ కేసుల‌లో 161 మంది ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌టంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నార‌ని, మిగ‌తా అంద‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo