ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 19:37:07

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వంద‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 397 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటి 10,118కి చేరింది. ఇక బుధ‌వారం కొత్త‌గా 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 164కు చేరింది. మొత్తం కేసుల‌లో 6,151 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జిలు, మ‌ర‌ణాలు పోగా మిగిలిన వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌ర్ణాట‌క ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.           


logo