సోమవారం 25 మే 2020
National - Mar 29, 2020 , 21:16:43

భార‌త్‌లో వెయ్యి దాటిన క‌రోనా పాజిటివ్‌ కేసులు

 భార‌త్‌లో వెయ్యి దాటిన క‌రోనా పాజిటివ్‌ కేసులు

భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,024 కు పెరిగింది. దేశంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 27 కి చేరింది. డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 85 కాగా... ఇంకా 901 మంది  చికిత్స పొందుతున్నారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 200 పెరుగుతుంది. ఇవాళ ఒక్క‌రోజే ఆ రాష్ట్రంలో 22 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక కేర‌ళ‌లోనూ భారీగానే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ  ఒక్క‌రోజే  అక్క‌డ కొత్త‌గా 20 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మొత్తం 181కి చేరింది. ఇక క‌ర్ణాట‌క‌లో 76, తెలంగాణ‌లో 70, ఏపీలో 21 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక  ప్రపంచం మొత్తం మీద 663,740 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు  30,879 మరణాలు సంభవించాయి.


logo