శనివారం 04 జూలై 2020
National - Jun 02, 2020 , 21:37:57

బెంగాల్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

బెంగాల్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాప‌కింద నీరులా పెరుగుతూనే ఉన్న‌ది. మంగ‌ళ‌వారం కొత్త‌గా 396 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,168కి చేరింది. ఇక మంగ‌ళ‌వారం బెంగాల్లో ఒక్క క‌రోనా మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో మొత్తం 263 మంది క‌రోనా రోగులు మృతిచెందారు. ప‌శ్చిమ‌బెంగాల్ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.   


logo