ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 18:36:04

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా విజృంభ‌ణ‌

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా విజృంభ‌ణ‌

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం సాయంత్రం నుంచి మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో త‌మిళ‌నాడులో కొత్త‌గా 4,965 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,80,643కు చేరింది. అందులో 1,26,670 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 51,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక‌, త‌మిళ‌నాడులో మ‌ర‌ణాలు కూడా భారీగా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 75 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,626కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo