సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 22:35:47

రాజ‌స్థాన్‌లో పెరుగుతున్న క‌రోనా

రాజ‌స్థాన్‌లో పెరుగుతున్న క‌రోనా

జైపూర్‌: ‌రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. శ‌నివారం కూడా కొత్త‌గా 711 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 28,500కు చేరింది. వాటిలో 21,144 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 20,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శ‌నివారం కూడా 518 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా, వారిలో 453 మంది డిశ్చార్జి అయ్యారు. 

రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతూనే ఉన్నాయి. శ‌నివారం ఏడుగురు క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 553కు చేరింది. రాజ‌స్థాన్ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo