శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 11:14:55

ఒడిశాలో పెరుగుతున్న కరోనా

ఒడిశాలో పెరుగుతున్న కరోనా

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉధృతమవుతున్నది. మొదట్లో దేశమంతటా వేలల్లో కేసులు నమోదైనా ఒడిశాలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత వారం, పది రోజుల నుంచి మాత్రం క్రమం తప్పకుండా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శుక్రవారం కూడా కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఉదయం 9 గంటల వరకు ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 737కు చేరింది. అయితే ఈ మొత్తం కేసులలో ఇప్పటికే 166 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. ఈ డిశ్చార్జిలు, మరణాలు పోను మిగతా 568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.  


logo