శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 18:35:10

మ‌హారాష్ట్ర పోలీస్ శాఖ‌లో క‌రోనా విస్తృతి

మ‌హారాష్ట్ర పోలీస్ శాఖ‌లో క‌రోనా విస్తృతి

ముంబై: మహారాష్ట్ర పోలీస్‌ శాఖలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. గత 48 గంటల్లో మహారాష్ట్రలో 185 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధ‌ప‌డుతున్న మ‌రో ఇద్ద‌రు పోలీసులు మృతిచెందారు. దీంతో మహారాష్ట్ర పోలీస్‌ శాఖలో నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4288కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల‌లో 3,239 మంది పోలీసులు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, బుధ‌వారం మ‌ర‌ణించిన ఇద్ద‌రు పోలీసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం పోలీస్ మ‌ర‌ణాల సంఖ్య 51కి చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 


logo