సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 10:46:12

మ‌హారాష్ట్ర జైళ్ల‌లో క‌రోనా విస్తృతి

మ‌హారాష్ట్ర జైళ్ల‌లో క‌రోనా విస్తృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. ముంబై, పుణె న‌గ‌రాల‌తోపాటు ప‌లు ప‌ట్ట‌ణాల్లో క‌రోనా కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. మ‌హారాష్ట్ర పోలీసులలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతున్న‌ది. జైళ్ల‌లో సైతం క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు ఖైదీలు, జైళ్ల సిబ్బంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డ్డ ఖైదీల సంఖ్య 363కు, సిబ్బంది సంఖ్య 102కు చేరింది. 

కాగా, మొత్తం కేసుల‌లో 255 మంది ఖైదీలు, 82 మంది సిబ్బంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. జైళ్ల సిబ్బందిలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించ‌న‌ప్ప‌టికీ ఖైదీల్లో మాత్రం న‌లుగురు క‌రోనా బాధితులు మృతిచెందారు. ఇక మ‌హారాష్ట్ర‌లోని మొత్తం జైళ్ల‌లో ప‌రిశీలిస్తే ముంబై సెంట్ర‌ల్ జైల్లో అత్యధికంగా కేసులు న‌మోద‌య్యాయి. అక్క‌డ 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకింది. మ‌హారాష్ట్ర జైళ్ల విభాగం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  


logo