ఆదివారం 12 జూలై 2020
National - Jun 29, 2020 , 19:55:40

మ‌హారాష్ట్ర‌లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

మ‌హారాష్ట్ర‌లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. ఎన్ని నియంత్రణ చ‌ర్య‌లు చేప‌ట్టినా రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ప్ర‌తి రోజులు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. సోమ‌వారం కొత్త‌గా 5,257 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. 

మొత్తం కేసుల‌లో 73,298 యాక్టివ్ కేసులు కాగా 88,960 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక మ‌ర‌ణాలు ప్ర‌తిరోజు వంద‌కు త‌గ్గ‌కుండా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 103 మంది క‌రోనా బాధితులు చ‌నిపోగా, అంత‌కుముందు మ‌రో 78 మంది మ‌ర‌ణించారు. అంటే గ‌త 48 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 181 క‌రోనా బాధితులు మృతిచెందారు. మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 


logo