శుక్రవారం 05 జూన్ 2020
National - May 19, 2020 , 13:28:22

కర్ణాటకలో మరింత విస్తరిస్తున్న కరోనా

కర్ణాటకలో మరింత విస్తరిస్తున్న కరోనా

బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. రోజురోజుకు క్రమం తప్పకుండా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1373కు చేరింది. వారిలో 40 మంది కరోనావల్ల మరణించగా, మరో వ్యక్తి ఇతర కారణాలతో మృతిచెందాడు. మొత్తం 41 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 530 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాలు, డిశ్చార్జిలు పోగా 802 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ మంగళవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించింది.


logo