సోమవారం 01 జూన్ 2020
National - May 17, 2020 , 14:44:41

క‌ర్ణాట‌క‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌ర్ణాట‌క‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం కొత్త‌గా 54 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 1146కు చేరింది. క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అయితే, మొత్తం కేసుల‌లో 37 మంది మ‌ర‌ణించ‌గా 497 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, మిగ‌తా 611 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసోలేష‌న్ల‌లో ఉన్నార‌ని చెప్పారు. 


logo