శుక్రవారం 03 జూలై 2020
National - Jun 01, 2020 , 19:43:24

త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి

త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా న‌మోద‌వుతున్న‌ట్లే ఈ రోజు కూడా వెయ్యికి త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. సోమ‌వారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1162 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 23,495కు చేరింది. ఇక మ‌ర‌ణాలు కూడా ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతూనే ఉన్నాయి. సోమ‌వారం కూడా 11 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 184కు చేరింది. ఇక ఇప్పటివ‌ర‌కు మొత్తం 13,170 మంది క‌రోనా రోగులు వైర‌స్ బారి నుంచి కోలుకోగా, 10,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.    logo