మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:32:13

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 10,576 కేసులు

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 10,576 కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10,576 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది. అందులో 1,87,769 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,36,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో వంద‌ల్లో న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్తగా 280 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 12,556కు చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo