బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 13:45:37

వృద్ధుల్లో కేసులు త‌క్కువ.. మ‌ర‌ణాలు ఎక్కువ‌

వృద్ధుల్లో కేసులు త‌క్కువ.. మ‌ర‌ణాలు ఎక్కువ‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో  క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతున్న‌ది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 422 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 9,755కు చేరింది. అయితే మొత్తం కేసుల‌లో 148 మంది మ‌ర‌ణించ‌గా, 4,202 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా 5,405 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అయితే మొత్తం కేసుల‌లో వ‌య‌సుల వారీగా చూస్తే 60 ఏండ్లు ఆపైన‌ వ‌య‌సు వారు 1412 మంది, 50 నుంచి 60 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారు 1493 మంది, 50 ఏండ్ల లోపు వ‌య‌సు వారు 6,850 మంది ఉన్నారు. అయితే మ‌ర‌ణాలు సంభ‌వించిన తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న‌ది. మొత్తం 148 మ‌ర‌ణాల్లో 60 ఏండ్లు అంత‌కు పైబ‌డినవారు 77 మంది, 50 నుంచి 60 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సువారు 40 మంది, 50 ఏండ్ల లోపు వ‌య‌సు ఉన్న‌వారు 31 మంది ఉన్నారు. అంటే ఢిల్లీలోని వృద్ధుల్లో కేసులు త‌క్కువ‌గా ఉన్నా.. మ‌ర‌ణాల రేటు మాత్రం ఎక్కువ‌గా ఉంటున్న‌ది.   


logo