శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 19:40:23

తమిళనాడులో 10 వేలకు చేరువలో కరోనా కేసులు

తమిళనాడులో 10 వేలకు చేరువలో కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. శుక్రవారం కొత్తగా 447 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,674కు చేరింది. శుక్రవారం కొత్తగా మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య కూడా 66కు చేరింది. మరో 2,240 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులలో 2,240 డిశ్చార్జి అయిన వారు, 66 మంది మృతులు పోగా మరో 7,365 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


logo