శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 19:03:12

ఒడిశాలో 1103.. తమిళనాడులో 13,967 కరోనా కేసులు

ఒడిశాలో 1103.. తమిళనాడులో 13,967 కరోనా కేసులు

చెన్నై: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే తమిళనాడులో వేగంగా, ఒడిశాలో నిదానంగా కరోనా వైరస్‌ పెరుగుతున్నది. ఇప్పటివరకు తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 13,967కు, ఒడిశాలో మొత్తం కేసుల సంఖ్య 1103కు చేరింది. తమిళనాడులో గురువారం కొత్తగా 776 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 567 కేసులు కేవలం చెన్నైలోనే నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. ఒడిశాలోనూ మొత్తం 1103 కేసులలో ఏడుగురు మరణించగా, 393 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 703 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా ఆరోగ్య శాఖల అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. 


logo