బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 09:22:25

దేశంలో 70 వేలు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 70 వేలు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 2293 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.


logo