ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 22:20:24

ఢిల్లీలో 85 వేలు దాటిన క‌రోనా కేసులు

ఢిల్లీలో 85 వేలు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం కూడా కొత్త‌గా 2,084 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేల మార్కును దాటి 85,161కి చేరింది. మొత్తం కేసుల‌లో 56,235 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 26,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక సోమ‌వారం కొత్తగా మ‌రో 57 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,680కి చేరింది. ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.             ‌


logo