శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 19:41:44

త‌మిళ‌నాడులో 8,000 మందికి క‌రోనా

త‌మిళ‌నాడులో 8,000 మందికి క‌రోనా

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. సోమ‌వారం కొత్త‌గా మ‌రో 798 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటి 8,002కు చేరింది. ఇక సోమ‌వారం కొత్త‌గా మ‌రో ఆరుగురు క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 53కు చేరింది. మొత్తం కేసుల‌లో 2,051 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 5,895 మంది వివిధ ఆస్ప‌త్రుల్లోని ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.      

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo