మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 22:14:09

బెంగాల్‌లో 70 వేలు దాటిన‌ క‌రోనా కేసులు

బెంగాల్‌లో 70 వేలు దాటిన‌ క‌రోనా కేసులు

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు న‌మోద‌య్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 2,496 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 70,188కి చేరింది. అందులో 48,374 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 20,233 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్ర‌వారం కొత్త‌గా మ‌రో 45 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో బెంగాల్‌లో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1581కి చేరింది. ప‌శ్చిమ‌బెంగాల్ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.                                                            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo