మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 14:05:15

69 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్ష‌లు!

69 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్ష‌లు!

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు ప‌ది వేల‌కుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అధికారులు దేశంలోని వివిధ ల్యాబ్‌లలో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల సంఖ్యను పెంచారు. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి సోమ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో  దేశవ్యాప్తంగా 1,43,267 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ICMR) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 

కాగా, కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 69,50,493 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన‌ట్ల‌య్యింద‌ని ఐసీఎమ్మార్‌ వెల్ల‌డించింది. కాగా, దేశ‌వ్యాప్తంగా మొత్తం 953 ల్యాబోరేట‌రీల్లో క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అందులో 699 ప్ర‌భుత్వ ల్యాబొరేట‌రీలు కాగా, 254 ప్రైవేటు ల్యాబొరేట‌రీలు ఉన్నాయి. 


logo