బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 21:05:51

బెంగాల్‌లో 600 దాటిన మ‌ర‌ణాలు

బెంగాల్‌లో 600 దాటిన మ‌ర‌ణాలు

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య‌ రోజురోజుకూ పెరిగిపోతున్న‌ది. గురువారం కొత్త‌గా 470కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 16 వేలకు చేరువ‌య్యింది. మొత్తం 15,648 కేసులు న‌మోద‌య్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా గురువారం కొత్త‌గా 15 మంది మృతి చెంద‌డంతో 600 మార్కు దాటి 606కు చేరింది. మొత్తం కేసుల‌లో 4,852 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండగా.. మ‌రో 10,190 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo