గురువారం 16 జూలై 2020
National - Jun 21, 2020 , 11:57:10

పుణెలో 15 వేలు దాటిన క‌రోనా కేసులు

పుణెలో 15 వేలు దాటిన క‌రోనా కేసులు

పుణె: మహారాష్ట్ర‌లోని పుణె న‌గ‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ముంబై త‌ర్వాత ఆ రాష్ట్రంలో పుణెలోనే ఎక్కువ‌గా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా రోజుకు 500కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు బ‌య‌ట‌పడుతున్నాయి. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల్లో కొత్త‌గా 823 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో పుణెలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేల మార్కును దాటి 15,004కు చేరింది. 

క‌రోనా మ‌ర‌ణాలు కూడా పుణెలో ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 24 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 584కు చేరింది. కాగా దేశ‌వ్యాప్తంగా కూడా క‌రోనా కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌లు దాటింది. అందులో ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 1.20 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు ఉన్నాయి.    logo