సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 20:15:34

గుజరాత్‌లో 12 వేలు దాటిన కరోనా కేసులు

గుజరాత్‌లో 12 వేలు దాటిన కరోనా కేసులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 395 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 12 వేల మార్కు దాటి 12,141కి చేరింది. కాగా మొత్తం కేసులలో 719 మంది మరణించగా మరో 5,043 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గుజరాత్‌ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.


logo