మంగళవారం 14 జూలై 2020
National - Jul 01, 2020 , 16:27:39

మ‌హారాష్ట్ర పోలీసుల‌లో 1000 దాటిన క‌రోనా కేసులు!

మ‌హారాష్ట్ర పోలీసుల‌లో 1000 దాటిన క‌రోనా కేసులు!

ముంబై: మ‌హారాష్ట్ర పోలీసుల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉన్న‌ది. ప్ర‌తిరోజు ప‌దుల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 77 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో పోలీసుల‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటి 1,015కు చేరింది. ఇక మ‌ర‌ణాలు కూడా చాప‌కింద నీరులా మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూనే ఉన్నాయి. బుధ‌వారం మ‌ర‌ణించిన పోలీస్‌తో క‌లిపి మొత్తం 60 మంది పోలీసులు క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మ‌హారాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo