గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 19:26:52

బంగ్లాదేశ్‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

బంగ్లాదేశ్‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రానికి గడచిన 24 గంటల్లో 3,803 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఒకేరోజు 3,800 కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి అక్క‌డి ఆరోగ్యశాఖ అధికారులు వెల్ల‌డించారు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి ఆ దేశంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ల‌క్ష మ‌ర్కును దాటి 1,02,292కు చేరింది. ఇక మ‌ర‌ణాలు కూడా బంగ్లాదేశ్‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. గురువారం కొత్తగా 38 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1343కు చేరింది. 


logo