మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 21:27:24

పాకిస్థాన్‌లో ల‌క్ష‌న్నర దాటిన క‌రోనా కేసులు

పాకిస్థాన్‌లో ల‌క్ష‌న్నర దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య ల‌క్ష‌న్న‌ర దాటింది. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో కొత్త‌గా 5,839 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,54,760కి చేరింది. పాకిస్థాన్ ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 

మొత్తం కేసుల‌లో పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 58,329 కేసులు నమోదుకాగా, సింధ్ ప్రావిన్స్‌లో 57,868 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఈ రెండు ప్రావిన్స్‌ల‌లో కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్థాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా పాకిస్థాన్‌లో బాగానే న‌మోద‌వుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో మొత్తం 2,975 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 


logo