బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 13:24:16

ఓటుహక్కు వినియోగించుకున్న కరోనా పేషంట్‌

ఓటుహక్కు వినియోగించుకున్న కరోనా పేషంట్‌

మధ్యప్రదేశ్‌ :  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే అక్కడ రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండడంతో శుక్రవారం ఆయన పీపీఈ కిట్‌ ధరించి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి భోపాల్‌లోని శాసనసభకు వచ్చారు. ఎన్నికల సిబ్బంది  ఆయన ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడంతో.. భౌతిక దూరం పాటించి.. ఏ ఒక్కరినీ కలువకుండా ఓటు వేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుంది. ఆయన వెళ్లిన తరువాత పరిసరాల్లో రసాయనాలు పిచికారీ చేయడంతో పాటు, శానిటైజ్‌ చేశారు.


logo