మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 23:49:26

కరోనా వచ్చిన తల్లులు శిశువులకు పాలు ఇవ్వొచ్చా?

కరోనా వచ్చిన తల్లులు శిశువులకు పాలు ఇవ్వొచ్చా?

హైదరాబాద్: రోజురోజుకూ కరోనా మహమ్మారి అందరికీ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. కరోనా వచ్చిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చా ? లేదా ? బాలింతలు నిస్సందేహంగా పాలు ఇవ్వొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తల్లిపాలు శిశువుకు ఎంతో మేలు చేస్తాయని శిశువు పుట్టినప్పటి నుంచి ఆరునెలల వరకు శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది.

కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ చెబుతున్నది. కరోనావైరస్ అనేది ఉమ్మనీరులోగాని అలాగే తల్లిపాలతో గాని కనిపించలేదని స్పష్టం చేసింది. అంటే, ఈ వైరస్ ప్రెగ్నన్సీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం లేదని అలాగే తల్లిపాల ద్వారా శిశువుకు సోకే ప్రమాదం కూడా లేదని స్పష్టంచేసింది. పిల్లల్ని తాకే ముందు అలాగే తాకిన తరువాత చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ తో పాటు శిశువుకు ఇతర ఆహారాలని కూడా అందించే సందర్భంలో శిశువుకు కప్ తో ఫీడింగ్ ఇవ్వాలి. అలాగే, కప్పును, బాటిల్స్ ను అలాగే చనుమొనలను ముట్టుకునే ముందు చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే శిశువుకు ఎలాంటి ప్రమాదం ఉండదు.


logo