గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 15:41:59

యోగాతో కరోనా సోకే అవకాశం తక్కువ : కేంద్ర ఆయుశ్‌ మంత్రి

యోగాతో కరోనా సోకే అవకాశం తక్కువ : కేంద్ర ఆయుశ్‌ మంత్రి

న్యూ ఢిల్లీ : యోగా చేసే వాళ్లకు కరోనా సోకే అవకాశం తక్కువగా ఉంటుందని కేంద్ర ఆయుశ్‌ మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోవాలో ఆయన మాట్లాడారు. కరోనా వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన ఎంతో మేలు చేస్తుందని అయన అన్నారు.

యోగా డే సందర్భంగా గోవాలోని ఆయన నివాసంలో ఆసనాలు వేశారు. యోగా చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శ్వాసకోశ వ్యవస్థ బలోపేతమై కరోనా లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే యోగా చేయాలన్నారు. logo