మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 14:36:52

మధ్యప్రదేశ్‌లో కరోనా అదుపులోనే ఉంది : ఆరోగ్య శాఖమంత్రి

మధ్యప్రదేశ్‌లో కరోనా అదుపులోనే ఉంది : ఆరోగ్య శాఖమంత్రి

న్యూ ఢిల్లీ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉందని అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా సోమవారం అన్నారు. అ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి 72శాతం మాత్రమే  ఉందన్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పుడు 2500 ఉండగా తాము 25,000 బెడ్లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. 

ఢిలీ, ముంబయ్‌లతో పోల్చుకుంటే మా వద్ద రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని,  ఒకవేళ వ్యాధి తీవ్రత పెరగినా మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామనే ధైర్యం ఉందన్నారు. మా వద్ద బెడ్లు, ఆక్సీజన్‌, వెంటిలేటర్ల విషయంలో ఎలాంటి కొరత లేదని, మాస్కులు, పీపీఈ కిట్లు కూడా పూర్తిస్థాయిలో సమకూర్చామని, మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఇంకా చేయి దాటి పోలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

అయితే మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 13186 పాజిటివ్‌ కరోనా కేసులుండగా, 10084 మంది డిశ్జార్జి అయ్యారు. 2545 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. 557 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తెలియజేశారు. 


logo