బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:44:00

భార‌త్‌లో వైర‌స్‌ సంక్ర‌మ‌ణ రేటు త‌క్కువే..

భార‌త్‌లో వైర‌స్‌ సంక్ర‌మ‌ణ రేటు త‌క్కువే..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు ఇండియాలో త‌క్కువ‌గానే ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రోజున సుమారు 16002 క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.  దాంట్లో కేవ‌లం 0.2 శాతం మాత్ర‌మే పాజిటివ్ కేసులు ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు.  శ్యాంపిళ్లు సేక‌రించిన ఆధారంగా, ఇన్‌ఫెక్ష‌న్ రేటు పెద్ద‌గా లేద‌ని అగ‌ర్వాల్ తెలిపారు.  రాపిడ్ డ‌యాగ్న‌స్టిక్స్ కిట్స్‌ను అంద‌రికీ పంపిణీ చేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.  కానీ ఎప్పుడూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అగ‌ర్వాల్ తెలిపారు.

మ‌న‌దేశంలో కావాల్సినంత హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వ‌లు ఉన్న‌ట్లు కేంద్ర విదేశాంగ‌శాఖ కోఆర్డినేట‌ర్ ద‌మ్ము ర‌వి తెలిపారు. చాలా వ‌ర‌కు దేశాలు ఆ డ్ర‌గ్ కావాలంటూ విజ్ఞ‌ప్తులు చేస్తున్నాయ‌ని, కానీ మ‌న‌కు కావాల్సినంత మ‌న ద‌గ్గ‌ర ఉంచుకుని, ఇత‌ర దేశాల‌కు అవ‌స‌రం మేర‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇండోపాక్‌, ఇండోబంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో ఫెన్సింగ్ లేని ప్రాంతాలు వ‌ద్ద బందోబ‌స్తు ప‌టిష్టంగా ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి స‌లిలా శ్రీవాత్స‌వ్ తెలిపారు.
logo