బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 19, 2020 , 12:25:04

కేరళలో ఏడేళ్ల కిందటనే ‘కరోనా’!

కేరళలో ఏడేళ్ల కిందటనే ‘కరోనా’!

హైదరాబాద్‌ : కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఆ మాట వింటే చాలు.. చిన్న, పెద్ద, పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడుతున్నరు.. కేరళలో కొంతమందికి మాత్రం గత ఏడేళ్ల నుంచి ‘కరోనా’ పరిచయం ఉంది!. అవును మీరు చదివింది నిజమే.. అది మాయదారి వైరస్‌ కాదు అదో షాపు పేరు. జార్జ్‌ అనే ఓ వ్యాపారి తన దుకాణానికి పెట్టుకున్న పేరు. కొట్టాయమ్ కలతిప్పడి ప్రాంతంలో మహమ్మారి మధ్య స్టోర్‌కు పెట్టిన పేరు వినియోగదారులను అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో తన వ్యాపారం వృద్ధి చెందుతోందని వ్యాపారి జార్జ్‌ తెలిపారు. కలతిప్పడిలో ఉన్న అతను మొక్కలు, కుండలు, మొక్కలు, దీపాలు, ఇతర సామగ్రిని విక్రయిస్తాడు. ‘కరోనా’ అనే పదానికి లాటిన్‌ భాషలో ‘కిరీటం’ అని అర్థమని జార్జ్‌ తెలిపాడు. దీంతో తన దుకాణానికి ఆ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.