మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 21:49:57

అందుబాటులో ఉన్న కరోనా హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీలు ఇవే...

 అందుబాటులో ఉన్న కరోనా హెల్త్  ఇన్యూరెన్స్ పాలసీలు ఇవే...

ముంబై :ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అదే పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించే ఆరోగ్య బీమా పాలసీలు కలిగి ఉండటం చాలా అవసరం. కరోనా వైరస్ చికిత్సకు కవరేజీ అందించేందుకు పలు  బీమా సంస్థలు ప్రత్యేకంగా పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇతర ఆరోగ్య బీమా పథకాల మాదిరిగానే ఈ పాలసీలు కూడా హాస్పిటలైజేషన్  ఖర్చులకు కవరేజీ అందిస్తాయి. అలాగే ప్రీ ,పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, అవుట్ పేషెంట్ ఖర్చులు, మందుల ఖర్చులు వంటి సమగ్ర కవరేజీని ఈ కరోనా వైరస్ ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తాయి. ఇక్కడ గమనించాల్సి మరొక విషయం ఏమిటంటే కొవిడ్-19 ఆరోగ్య బీమా పథకాలు పిపిఈ కిట్ల ఖర్చుకు కూడా కవరేజీ అందిస్తాయి.

“ఆరోగ్య బీమా పథకాలు కొవిడ్-19 చికిత్సకు కవరేజీని అందిస్తాయి. అయితే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు ప్రత్యేకంగా కొవిడ్-19 చికిత్స కోసమే రూపొందించారు. ఇవి పిపిఈ కిట్స్, మాస్క్ లు, గ్లౌజుల ఖర్చుతో పాటు, హెం ఐసోలేషన్, డయోగ్నొస్టిక్ ఖర్చులకు కూడా కవరేజీ అందిస్తాయని పాలసీ ఎక్స్ డాట్ కామ్ సీఈవో నవల్ గోయల్ తెలిపారు. ఐఆర్డీఏఐ మార్గనిర్దేశకాల మేరకు ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసం బీమా సంస్థలు రెండు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అవి,1.కరోనా కవచ్, 2.కరోనా రక్షక్... ఈ రెండు పాలసీలు కూడా స్టాండర్డ్ కొవిడ్-19 పాలసీలు. ఈ పాలసీల  నిబంధనలు ఇతర ఆరోగ్య బీమా పథకాల నిబంధనలను పోలి ఉంటాయి.

కరోనా కవచ్ బీమా పాలసీ అనేది స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ కింద హాస్పిటలైజేషన్ ఖర్చులు, హోం ఐసోలేషన్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, పిపిఈ కిట్ల ఖర్చులు, మందుల ఖర్చులు,మాస్క్ లు, గ్లౌజులు, ఐసియూ ఖర్చులకు కవరేజీ లభిస్తుంది. ఈ పథకం  బీమా మొత్తం రూ. 50,000 దగ్గర నుంచి ప్రారంభమవుతుంది.   గరిష్టంగా రూ. 5 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. ఈ పథకం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించవచ్చు. అలాగే ఆయుష్ చికిత్సా విధానాలకు కూడా ఈ పథకం కవరేజీ అందిస్తుంది. ఈ పాలసీ కింద ఆప్షనల్ కవర్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. కొవిడ్-19 చికిత్స కోసం పాలసీదారుడు 24 గంటల కంటే ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి నగదు ప్రయోజనం కింద బీమా మొత్తంలో 0.5 శాతం రోజువారీ నగదు కింద అందిస్తారు. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు చెల్లించవచ్చు. “ఇప్పటికే ఆరోగ్య బీమా కలిగి ఉండి ,ఆరోగ్య బీమా మొత్తం తక్కువగా ఉన్నట్లయితే కరోనా కవచ్ పాలసీని ఎంచుకోవచ్చు.  ఈ కరోనా కవచ్ పాలసీ కింద సమగ్ర కవరేజీ లభిస్తుంది.

ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే, కరోనా కవచ్ పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే కరోనా కవచ్ పాలసీ కింద మొత్తం కుటుంబానికి రక్షణ కల్పించవచ్చు.”కరోనా రక్షక్ పాలసీ: కరోనా రక్షక్ పాలసీ, పాలసీదారుడు కొవిడ్-19 చికిత్స కోసం 72 గంటల కన్నా ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉన్నట్లయితే , బీమా మొత్తం ఒకేసారి అందిస్తారు.18 సంవత్సరాల నుంచి 65 ఏండ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అలాగే బీమా మొత్తం కనిష్టంగా రూ.50 వేల నుంచి, గరిష్టంగా 2.5 లక్షలు వరకు ఎంచుకోవచ్చు. ఆరోగ్య బీమా కలిగి ఉండి కొవిడ్-19 కారణంగా రోజువారీ ఆదాయాన్ని కొల్పోతే కరోనా రక్షక్ పాలసీని ఎంచుకోవడం మంచిది. పాలసీదారునికి కొవిడ్-19 నిర్థారణ అయితే, ఈ పాలసీ కింద ఒకే సారి బీమా మొత్తం చెల్లించబడుతుంది. ఈ పాలసీ వ్యక్తిగతంగా మాత్రమే కవరేజీ అందిస్తుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



logo