ఆదివారం 07 జూన్ 2020
National - Apr 10, 2020 , 01:32:31

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సిఫారసు చేయలేం: ఐసీఎంఆర్‌

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సిఫారసు చేయలేం: ఐసీఎంఆర్‌

  • కరోనా మూడో దశకు చేరుకోలేదని వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా రోగుల చికిత్స కోసం సాయపడుతున్నట్టు చెబుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధ వినియోగంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌(ఐసీఎంఆర్‌) కీలక ప్రకటన చేసింది. సంతృప్తికర ఫలితాలు వచ్చేంత వరకూ కరోనా రోగులకు ఈ ఔషధాన్ని తాము సిఫారసు చేయలేమని వెల్లడించింది. ‘కరోనా రోగుల చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తప్పనిసరి కాదని గమనించాలి. వైరస్‌ తీవ్రతను ఈ ఔషధం తగ్గిస్తుందో, లేదో పరీక్షల అనంతరం తెలుస్తుంది. వైద్యులు దీనిపై ఇంకా పరీక్షలు జరుపుతున్నారు. సంతృప్తికర ఫలితాలు వచ్చేంతవరకూ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎవరికీ సిఫారసు చేయలేం’ అని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త ఆర్‌ గంగ కేట్కర్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా మూడో దశ(సమూహ సంక్రమణ)కు చేరుకోలేదని ఆయన పునరుద్ఘాటించారు. 


logo