మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:19:18

కరోనా హుష్‌కాకి.. ఇక చిందేద్దాం

కరోనా హుష్‌కాకి.. ఇక చిందేద్దాం

పూణే : కరోనా మహమ్మారి సోకిందనగానే చాలా మంది భయపడిపోతారు. కరోనా బారిన పడి కోలుకున్నతరువాత హమ్మయ్య! బతికి బయట పడ్డాంరా బాబు అనుకుంటాం. అయితే ఒక యువతి కరోనాను జయించి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆమె సోదరి పాటకు నృత్యం  చేస్తూ ఆమెకు స్వాగతం పలుకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అయ్యింది.

పూణేలో సలోని సాట్పుట్ అనే 23 ఏళ్ల యువతి, ఆమె సోదరి స్నేహాల్‌ కరోనాను జయించి ఇంటికి వస్తున్నప్పుడు నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. ఈ వీడియోను దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్‌ అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. “సోదరీమణుల ఆనందం నాకు నచ్చింది. కరోనాను ఓడించిన తన సోదరికి స్వాగతం పలుకుతూ ఆమె ఆనందంగా వేసే చిందులు ఆకట్టుకున్నాయి.’’ అని ఆయన రాసుకొచ్చాడు. 

ఇంటికి వచ్చే వీధిలోకి స్నేహాల్‌ ప్రవేశించిన వెంటనే..సలోని ‘చిల్లర్ పార్టీ’ చిత్రం నుంచి ‘తాయ్ తాయ్ ఫిష్’ అనే ప్రాచుర్యం చెందిన పాటను  పెట్టి నృత్యం ప్రారంభిస్తుంది. స్నేహాల్‌ ఇంటికి చేరుకోగానే ఆమె కూడా సలోనితో కలిసి చిందేస్తుంది. ఆ తర్వాత వారి తల్లి ఆమెను హారతిచ్చి ఇంటి లోపలికి స్వాగతించింది.

అయితే స్నేహాల్‌తో పాటు వారి తండ్రికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇద్దరిని దవాఖానకు తరలించారు. దీంతో సుమారు నెల రోజుల పాటు సలోని ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది. ఇన్ని రోజుల తరువాత సోదరి ఇంటికి తిరిగి రావడంతో ఆమె ఆనందంతో చిందులు వేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo