ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:32:49

బెంగుళూరు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా

బెంగుళూరు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో  90 మందికి కరోనా

బెంగళూరు :  ఓ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి పైగా ట్రైనీలకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గురువారం పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లోని అందరికి కరోనా పరీక్ష నిర్వహించారు. అయితే దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. వారితో 90 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన ట్రైనీలను వ్యాధి తీవ్రతను బట్టి దవాఖానలకు, కరోనా కేర్ సెంటర్లకు పంపించారు.

వారికి సమీపంగా మెలిగిన మరో 150 మందిని క్వారంటైన్‌కి పంపారు. స్కూల్ పరిసరాలు మొత్తం శానిటైజేషన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం బెంగళూరులో వెయ్యి మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo