సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 01:44:34

నౌకలోకి కరోనా ఎలా వచ్చిందబ్బా!

నౌకలోకి కరోనా ఎలా వచ్చిందబ్బా!

న్యూఢిల్లీ: అర్జెంటీనాలో చేపల వేటకెళ్లిన ఓ నౌకలో 57 మందికి కరోనా రావడం పెద్ద మిస్టరీగా మారింది. జూన్‌ 6న  61 మంది ‘ఏచిజన్‌ మారు’ అనే నౌకలో సముద్రంలో చేపల వేటకెళ్లారు. అంతకు మందుకు వారికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి, నౌకను శానిటైజ్‌ చేశాక చేపల వేటకు పంపారు. 35 రోజల తర్వాత ఈ నెల 13న నౌక తిరిగి వచ్చాక వారికి పరీక్షలు నిర్వహిస్తే 57 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఈ 35 రోజులు వారు వేరే ఎవరినీ కలువకున్నా, వారికి వైరస్‌ ఎలా సోకిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. logo