మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 14:49:25

మరో 36 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా

మరో 36 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా

న్యూ ఢిల్లీ : బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కరోనా కలవరపెడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చక్కబడుతోందని బీఎస్ఎఫ్‌ అధికారులు వెల్లడిస్తున్నా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 34 మంది బార్డర్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  కాగా.. 33 మంది కోలుకున్నట్లు అధికారులు తెలియజేశారు.  ఇప్పటి వరకు మొత్తం 817 మంది కరోనా బారి నుంచి బయటపడగా.. 526 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 

అయితే పాజిటివ్‌ వచ్చిన చాలామందికి ఎలాంటి లక్షణాలు లేవని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు సహకరిస్తున్నారని బీఎస్ఎఫ్‌ ఉన్నత స్థాయి అధికారులు తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo