గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 13:36:53

110 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా..!

110 మంది ఆర్మీ సిబ్బందికి కరోనా..!

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 110 మంది ఆర్మీ సిబ్బందికి  కరోనా వైరస్‌ సోకిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తెలిపారు. గత రెండు మూడు రోజుల్లోనే 100 మంది కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. అయితే వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్మీ సిబ్బంది ఏయే ప్రాంతాలకు వెళ్లారనేది అధికారిక రికార్డుల్లో నమోదై ఉంటుందన్నారు.

ఈ విషయంలో అన్ని చర్యలూ చేపడుతున్నామని సీఎం హామీ ఇచ్చారు. ఇక  ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకూ 4102 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 1030 మంది రోగులు ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. మూడు వేల పైచిలుకు రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 కరోనా మరణాలు సంభవించాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo