ఆదివారం 07 జూన్ 2020
National - Apr 01, 2020 , 22:44:59

ఢిల్లీలో వేగంగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి

ఢిల్లీలో వేగంగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతోంది.  ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో  ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొత్తం అక్క‌డ కరోనా కేసుల సంఖ్య 152కు చేరింది. నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న చాలామందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.  గ‌డిచిన‌ 24గంటల్లో మొత్తం 32 కొత్త కరోనా కేసులు నమోదు కాగా...  కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన వారిలో 53 మంది తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారేనని స‌మాచారం. మొత్తం కేసుల్లో 51మంది విదేశీ ప్రయాణం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 19 మందికి వైరస్ ఎలా సోకిందో తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.  అటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.logo