ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 10:30:30

క‌రోనా ఎఫెక్ట్‌: కేర‌ళ‌లో స్ట్రాబెర్రీ రైతుల విల‌విల‌

క‌రోనా ఎఫెక్ట్‌: కేర‌ళ‌లో స్ట్రాబెర్రీ రైతుల విల‌విల‌

ఇడుక్కి: క‌రోనా మహ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. క‌రోనా కార‌ణంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేర‌ళ‌లో స్ట్రాబెర్రీ రైతులను కూడా క‌రోనా క‌ష్టాలపాలు చేసింది. క‌రోనా కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో.. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన త‌మ‌ పంట‌ను అమ్ముకునే ప‌రిస్థితి లేక ఇడుక్కి జిల్లాలోని మున్నార్ ఏరియాకు చెందిన స్ట్రాబెర్రీ రైతులు ఆవేద‌న చెందుతున్నారు. స్ట్రాబెర్రీ ఖ‌రీదైన పంట కావ‌డం, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర‌మైన‌ది కాక‌పోవ‌డంతో కూడా ఈ పంట‌ను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని, దీనివ‌ల్ల ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టిన‌ తాము తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని గ‌తంలో బెస్ట్ స్ట్రాబెర్రీ రైతు అవార్డు పొందిన అరుల్ మ‌ణి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ఇడుక్కి జిల్లాలోని క్యారెట్ రైతుల‌ది కూడా అదే ప‌రిస్థితి ఉన్న‌ది.     


logo