మంగళవారం 31 మార్చి 2020
National - Mar 05, 2020 , 03:09:00

కరోనా ఎఫెక్ట్‌.. రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు బంద్‌

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్‌ కరోనా భారత్‌ను కూడా వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. పైగా ఈ రెండు, మూడు రోజుల నుంచి కరోనా ప్రభావం భారత్‌లో ఎక్కువైందనే చెప్పాలి. మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఒక ప్రకటలో తెలిపారు. 

ఇప్పుడు మనమంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొవిద్‌-19 ను అరికట్టేందుకు మనమంతా పూనుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలనీ.. జనసమూహంలోకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలనీ, కరచాలనం చేయకుండా నమస్కరిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. 


logo
>>>>>>