గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 03, 2020 , 19:13:39

స్వీట్స్ ఇండస్ట్రీ పై కరోనా ఎఫెక్ట్ : రూ.5,000 కోట్లు నష్టం

 స్వీట్స్  ఇండస్ట్రీ పై కరోనా ఎఫెక్ట్ : రూ.5,000 కోట్లు నష్టం

ఢిల్లీ : రక్షా బంధన్ పండుగ సమయంలో రాఖీ కట్టడంతో పాటు నోరును తీపి చేయడం సంప్రదాయం. స్వీట్స్ లేదా మిఠాయిలకు ఈ సీజన్ లో మంచి గిరాకీ ఉంటుంది. రాఖీపౌర్ణమి రోజున స్వీట్స్ పరిశ్రమ అధిక డిమాండ్ కారణంగా కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఈసారి కరోనా మహమ్మారి స్వీట్ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సమయంలో రూ.10,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఈసారి ఇది సగానికి పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం వాటిల్లిందని వారు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా రక్షాబంధన్ ఒకటి రెండు రోజుల ముందు నుంచి స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. కానీ ఈసారి ఆ సందడి కనిపించలేదు. ముఖ్యంగా దేశంలోని ముఖ్య నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో సాధ్యమైనంత వరకు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా సోదరులకు రాఖీలు పంపించారని, ప్రతిగా బహుమతులు పంపే వ్యాపారం పైన కూడా కరోనా ప్రభావం పడింది. రక్షాబంధన్ నుంచి  జన్మాష్టమి వరకు దేశంలో స్వీట్స్ అమ్మకాలు ఉంటాయి. సేల్స్‌లో 25 శాతం రక్షా బంధన్ సమయంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆశించిన అమ్మకాలు లేకపోవడంతో ఆశలు జన్మాష్టమిపై  పెట్టుకున్నారు వ్యాపారులు.


logo