సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 12:12:46

లగ్జరీ ప్రోడక్ట్స్ పై కరోనా ఎఫెక్ట్... ఎంతంటే..?

లగ్జరీ ప్రోడక్ట్స్ పై కరోనా ఎఫెక్ట్... ఎంతంటే..?

ముంబై : కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి, వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా క్రమంగా కోలుకుంటున్నాయి. అయితే కరోనా రెండో వేవ్ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొనుగోళ్లను తగ్గించారు. అత్యవసరమైతే తప్ప కొనుగోలు చేయడం లేదు. ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు క్షీణించాయి. అంతర్జాతీయంగా విలాసవంతమైన వస్తువులు, ఆభరణాలు, సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు 23 శాతం మేర క్షీణించవచ్చునని ప్రముఖ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ బెయిన్ నివేదిక తెలిపింది.

కరోనా కారణంగా అన్నిరంగాల కంటే లగ్జరీ వస్తువుల రంగం  కంటే ఎక్కువగా దెబ్బతిన్నదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇది ఎప్పుడు కోలుకుంటుందనేది కరోనా వ్యాక్సీన్ రాకపైన ఆధారపడి ఉంటుందని  వారు అంటున్నారు. వచ్చే ఏడాది ఈ వస్తువుల క్షీణత 10 శాతం నుండి 19 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. ఏడాది మొత్తానికి బ్రాండ్ ప్రాఫిట్ 60 శాతం క్షీణించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా 2022 నుండి 2023 మధ్య కోలుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

  కరోనా కారణంగా దాదాపు ఆరేండ్ల వృద్ధి తుడిచి పెట్టుకుపోయిందని బెయిన్ నివేదిక తెలిపింది. కరోనా వల్ల అమ్మకాలు 35 శాతం క్షీణిస్తాయని గతంలో అంచనా వేసింది. గత అంచనాతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగైనట్లు భావిస్తున్నారు. మొత్తం అమ్మకాల్లో మూడో వంతు వాటా ఉన్న చైనా మార్కెట్ రికవరీ కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కరోనా వల్ల 2020లో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తుడిచి పెట్టుకుపోయాయి. పూర్తి సంవత్సరానికి ప్రతికూలత నమోదు చేయనున్నాయి. ప్రారంభ త్రైమాసికాల్లో దెబ్బతిన్న చైనా మాత్రమే మిగతా దేశాల కంటే కోలుకొని, పాజిటివ్ వృద్ధి నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.వారెన్ బఫెట్ సంచలన నిర్ణయాలు...

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.