శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 16:00:01

కరెన్సీ ప్రింటింగ్‌పై కరోనా ప్రభావం

కరెన్సీ ప్రింటింగ్‌పై కరోనా ప్రభావం

కరోనా వైరస్‌ ప్రభావం కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌పై పడింది. భారత సెక్యూరిటీ ప్రెస్‌ (ఐఎస్‌పీ), కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ)లకు చెందిన అన్ని కార్యకలాపాలను ఈ నెల చివరివరకు మూసివేశారు. దేశంలో కరోనా విస్తురిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ మంగళవారం పత్రికా విడుదల చేసింది. ఐఎస్‌పీలో 1900మంది, సీఎస్‌పీలో 2100మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ యూనిట్లలో ఫైర్‌ అండ్‌ సేఫ్టీ సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని అధికారులు తెలిపారు. 1950లో కార్మికుల సమ్మెతో నెలరోజులు ఐఎస్‌పీ మూతపడగా.. , 1979లో కార్మికుల సమ్మెతో ఐఎస్‌పీ, సీఎన్‌పీ రెండూ నెలరోజులు మూసివేశారు.   


logo