శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 01, 2020 , 16:50:37

కరోనా ఎఫెక్ట్ : భారీగా తగ్గిన ఆదాయపు పన్ను రాబడి

కరోనా ఎఫెక్ట్ : భారీగా తగ్గిన ఆదాయపు పన్ను రాబడి

ఢిల్లీ : ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ పన్నులు 32.6 శాతం మేర క్షీణించింది. కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శనం. 1999 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఓ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ఇది అత్యంత దారుణమైన ఆర్థిక లోటు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వివిధ రంగాలపై ప్రభావం పడటంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పెద్ద మొత్తంలో తగ్గింది. కరోనా కారణంగా రెవెన్యూ తగ్గింది. అలాగే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వార్షిక లక్ష్యంలో ఆర్థిక లోటు 83.2 శాతానికి చేరుకుంది.

రెవెన్యూ తగ్గుదలలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ)పై గరిష్టంగా 53 శాతం దెబ్బపడింది. వినియోగం పెద్ద ఎత్తున పడిపోవడంతో ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 40 శాతం మేర క్షీణించవచ్చునని అంచనాలున్నాయి. ఫస్ట్ క్వార్టర్ జీడీపీ అంచనాలు ఆగస్ట్ 31వ తేదీన విడుదల కానున్నాయి. ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్పోరేట్ ట్యాక్స్ రెవెన్యూ 23.2 శాతం తగ్గింది. ఉద్యోగాల కోత, వేతనాల కోత నేపథ్యంలో ఇన్‌కం ట్యాక్స్ కలెక్షన్లు 36 శాతం తగ్గాయి. జూన్ మాసంలో పర్సనల్ ట్యాక్స్‌లో స్వల్ప వృద్ధి కనిపించింది.

ఇక, ప్రభుత్వం ఖర్చులకు సంబంధించి FY21 తొలి క్వార్టర్‌లో అంచనాలు 26.8 శాతం అంచనా కాగా, గత ఏడాది ఇది 25.9 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయాలు లేవని, దీంతో ప్రభుత్వం ఖర్చుల్లోను గణనీయమైన పెరుగుదల లేదని ఇది సూచిస్తున్నది. ఆదాయాలు తక్కువ ఉండటం వల్ల ఇది ఆర్థిక ఒత్తిడికి నిదర్శనమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.logo